ONE STOP DESTINATION FOR YOUR CAREER DEVELOPMENT IN EDUCATION AND EMPLOYEMENT
Pages
- TSWREIS
- swayam
- e-PG patashala
- cpget
- Open Access Books
- open access journals
- pdf drive
- National Digital Lib
- Dr.BRAOU vedios
- TSAT VEDIOS
- National Scholorships
- JAM
- SCERT
- NCERT books
- sci.periodicals
- IISER
- NISER
- Open Library
- SSC
- RRB
- IBPS
- IASc
- TSPSC
- upsc
- EMPLOYEMENT NEWS
- KNOW INDIA
- Sodhganga -ETD Ph.D reports
- Impact Vedios
- GURUKUL
- Ignou stu mat
- Cuet2024
- Sc journals
See New Notifications
Friday, May 24, 2024
Tuesday, April 30, 2024
Sunday, October 03, 2021
🌹🙏*మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి*…
_ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి …
_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !…
దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు…
సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు…
కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు..గుర్తుంచుకో …
జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు…
కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి…
పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు…
సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి…
నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు …
మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది…
నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో…
వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు…
నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు …
ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._
_మౌనంగావుండేవాడు ముని._
_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._
_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._
_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి…
పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది…
ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు…
వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు…
నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు…
అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా …
మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్…
పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు…
వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?…
పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_
_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి …
జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు…
*మానవులుగా బతకటం కాదు*..
*మానవత్వంతో బతకాలి*!🙏🙏🙏🌹🌹
🌹🙏*శుభోదయం*🙏🌹